21 August 2017

శ్రీదేవి హారతి పాట

శ్రీదేవి  హారతి పాట 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం 

రత్న వజ్ర వైడూర్య  కాంతిచే చిత్రవిచిత్ర  కాంతల సేవచే
 శివాకారపు  పాన్పుపై  ఆశీనులైన మన అమ్మవారికి 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం

నవ రత్నంబుల సువర్ణమయమై 
చూచువారికి చుడముచ్చటై 
అమ్మ ధరియించిన కిరీటంబునకు 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం

పరిమళ గంధకురుల సుమాలకు
 మృదువైన నీకేశపాశమునకు 
అందాలు చిందే సౌందర్యమాతకు 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం

అష్టమి చంద్రుని బోలిన నొసలుకు 
అరుణ కాంతి కస్తూరి తిలకమునకు 
విశాలమైన నేత్ర ద్వయమునకు 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం

మంగళ తోరణ కనుబొమ్మలకు 
సంపెంగ మొగ్గైన నాసికంబునకు 
కరుణారసమైన కర్ణంబులకు 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం

అరుణ వర్ణపు అధరంబులకి 
స్పటిక శోభాగల దంత పంక్తి కి 
దోష రహిత  సర్వాగంబులకు 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం

అర్థవికసిత యవ్వనపు ఠీవికి 
దివ్యములైన వస్త్ర కాంతికి 
సర్వ భూషణ ఆభరణములు 

జయ మంగళం నిత్య  శుభ మంగళం 
జయ మంగళం నిత్య  శుభ మంగళం




25 July 2017

మనిద్వీప నివసినికి మంగళ నీరాజనం....

మణిిద్వీపి వాసినికి  స్వయంజ్యోతి రూపినికి
శ్రీ లలితా మాతకు కెంపులతో   నీరాజనం నీరాజనం నీరాజనం...

శ్రీ త్రిపుర  సుందరికి  శ్రీ చక్రనివసినికి
శ్రీ మహాలక్ష్మికి ముత్యాలతో  నీరాజనం నీరాజనం నీరాజనం...

జగదేకమాతకు ఆ జగజ్జననికి జగములనేలు
ఆ జగదంబకు పగడాలతో  నీరాజనం  నీరాజనం నీరాజనం...

ఆది ప్రకృతియైన అఖిలండేశ్వరీ కి
శ్రీదేవి మాత కు ఇంద్రనీలమణులతో నీరాజనం నీరాజనం నీరాజనం......

గిరిరాజకన్యకు సౌందర్యలాహరికి
మందహాస చంద్రికకు వజ్రాలతో నీరాజనం నీరాజనం నీరాజనం......

రవిచంద్ర నయనికి రాజరాజేశ్వరి 
కారుణ్యలహరికి  వైడుర్యములతో నీరాజనం నీరాజనం నీరాజనం.....

కామేశ పట్టపురాణి శివసుందరికి భువనైక మాతకు
పద్మరాగమణులతో  నీరాజనం నీరాజనం నీరాజనం.....


మణిిద్వీపి వాసినికి  స్వయంజ్యోతి రూపినికి
లలితా భవానికి రతనాల  నీరాజనం నీరాజనం నీరాజనం.....

మంగళరూపిణి మహేశ్వరికి చంద్రహాస వాదనకి 
మా చల్లని చూపుల తల్లికి నవరత్నాల నీరాజనం నీరాజనం నీరాజనం.....










24 July 2017

భువనేశ్వరి స్థాన మణిద్వీప వర్ణనము.

శ్రీ తిభువనేశ్వరీ దేవి  నివసించు త్రిభువనలోకం  ఆ మణి ద్వీపము పరమపుణ్య దామము.

జనమేజయునకు  వ్యాస మహర్షి పదునాల్గు లోకాలకు మూలకారణమైన  శ్రీ త్రిభువనేశ్వరీ దేవి నివసించు  పరమధామమును గూర్చి ఇట్లు  చెప్ప నారంభిచేను:- 
 
   బ్రహ్మలోకమునకు పైన సర్వ లోకంననునది కలదు అదియే మణిద్వీపముగా ప్రసిద్దిగాంచినది. అన్ని లోకములకంటేను గొప్పదగుటచే మనిద్వీపముఅని  సర్వలోకమని కూడా పిలిచెదరు. శ్రీ పరంబిక దానిని తన సంకల్పము చేతనే  నిర్మించినది.శ్రీ మూల ప్రకృతి దేవి యీ సమస్త సృష్టికి పూర్వము మనిద్వీపము తన నివాసముగా నేర్పరచుకోనేను అది కైలాసము కంటే గొప్పది. వైకుంటము కంటే శ్ర్రేస్టమైనది. గోలోకముకన్న గొప్పదైనది. కనుకనే దానిని సర్వలోకమని పిలుచుచున్నారు. యీ మూడులోకములందు దానిని మించిన అందమైన లోకము మరియొకటి లేదు. అది ముజ్జగాములకు గొడుగు వంటిది. సంసార సంతాపమును నశింపుచేయునది. బ్రహ్మండములన్నిటికీ చల్లని నిడ వంటిది. ఇది ఎన్ని ఆమడల వైశాల్యాము గలదో  అంత గంభిరమైనది.
       
        ఆ మణిద్వీపమునకు నాల్గువైపులా నమృతసముద్రము ప్రకాశించుచుండును. అందు గాలి తాకునకు ఉవ్వెత్తుగ  లేచు చల్లని కెరటములు. రత్నాలఇసుక  ప్రదేశములును  దక్షిణావర్తము మొదలగునవి వివిధ శంఖములును పలువన్నెల చాపలును కనులపండుగ చేయుచుండును. అందు తరంగముల వరుసలచే కలిగిన చల్లనినీటి  తుంపరల వివిధ టెక్కముల టెక్కులుతో అటు నిటు ప్రయాణము చేయూ అందాల పడవలను బాసమానములై ఉండును.   ఆ పొడవైన గట్టులందు కనులకింపైన సొంపైన బంగారు చెట్ల వరుసలు కలవు. వాటి కావాలా ఇనుముతో నిర్మింపబడిన  ఎడమడల ఎత్తుగల దృఢమైన ప్రకారము కలదు. అచట అనేక శస్త్రాస్త్రమూల నుపయోగించి  పోరుటలో నేర్పరులగు రక్షకులు వీరోత్సాహాముతో నివశించుచుందురు .  

సౌభాగ్య లక్ష్మి రావమ్మా!



సౌభాగ్య లక్ష్మి రావమ్మా!


నుదుటకుంకుమను రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా
కంచనహారము గళమున మెరియగా పితంబరముల శోభలు నిండగా// సౌబాగ్య//

నిండుగా కరముల బంగారుగాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడి జేయగా సౌబాగ్యవంతుల సేవలనందగా //సౌబాగ్య//

నిత్యసుమంగళి నిత్యకల్యాణి భక్తజనుల మా కల్పవల్లివై
కమలాసనవై  కరుననిండగా కనకవృష్టి కురిపించే తల్లి    //సౌబాగ్య//

జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణిమని వై
సాధు సజ్జనుల పూజలనందుకొని  శుభములనిచ్చెడిదివేనలియగా   //సౌబాగ్య//

కుంకుమ శోబిత పంకజలోచని వెంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగా సౌబాగ్యములిచ్చే పుణ్యమూర్తి మాఇంట వెలసిన //సౌబాగ్య//

సౌభాగ్యమ్ములబంగారుతల్లి  పురందర విటలునిపట్టపురాణి
శుక్రవారం  పూజలనందగాసాయంకాలం శుభాగాడియాలలో //సౌబాగ్య//


మీ ఇంట్లో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే డబ్బు మిమల్ని ఆకర్సిస్తుతుంది..


మీ ఇంట్లో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే డబ్బు మిమల్ని ఆకర్సిస్తుతుంది..


1. డబ్బుని ఇష్టం వచ్చినట్లు మడిచి నిర్లక్ష్యంగా పర్సులో పడేయటం డబ్బును ఆగౌరవపరచినట్లు అవుతుంది. ధనాన్ని అగౌరవపరిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
2. ఉత్తరం వైపు  గోడకు గాని , తూర్పు వైపు గోడకుగాని ఈశాన్యం మూలగా ఒక అద్దాన్ని అమర్చితే అప్పులు తీరడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ అద్దం వెనుకగాని ఎరుపు - సిందూరం - మెరూన్ రంగులు ఉండకూడదు.
౩.అద్దం పెద్దదిగా తేలికగా వుంటే అంత లాభదాయకం.
4. ఎర్రని మట్టి పాత్రలో బార్లీ గింజలు మోలిపిచాలి.. మీ కోరికలు మనసులో తలచుకొని బార్లీ గింజలను మోలిపించాలి. మిగతా వాటికంటే బార్లీ గింజలు త్వరగా మొలుస్తాయి. ఆ మొలకలు పెరగడం మొదలవగానే మే కోరికకుడా తీరుతుంది . 
5. పరిసుబ్రత, పవిత్రత వున్నా ఇల్లు లక్ష్మి నిలయం. 
6. పాడైపోయిన  గడియారాలు, విరిగిపోయిన, నిర్జీవమైన  దేవుడి విగ్రహాలు, పాతబట్టలు ,పనికిరాని వస్తువులను ,ఇంటిలోనుంచి ఎప్పటికప్పుడు తీసి బయటపడవేయాలి. 
7.గడియారంలో టైం పదినిముషాలు ముందు వుండలికాని  లేటుగా ఉండకూడదు. 
8.మంగళవారంకానీ, శుక్రవారంకానీ, ఇంట్లో మైల తరువాత ఇల్లు తుడిచేటప్పుడు బకెట్ నీళ్ళలో కొద్దిగా పసుపు , కొద్దిగా ఉప్పు వేసి ఇల్లు తుడువాలి. 
9. పాదాల్లో మురికి పేరుకుపోయినవారి ఇండ్లకు లక్ష్మి దేవి రాదు. 
10. సూర్యోదయ, సూర్యాస్తమయ వేళ్ళల్లో నిద్రించే వారి గృహలల్లో లక్ష్మీదేవి నివశించదు. 
11. చిరుగు బట్టలు దరిద్రతకు గుర్తుగా నిలుస్తాయి. చిరిగిపోయిన దుస్తులను ధరిస్తే వున్నా అప్పులు తీరకపొగ కొత్త అప్పులు మెడకు చుట్టుకుంటాయి. \
12చెప్పులు వేసుకొని ఇంట్లోకిరాకూడదు. వస్తే బయట వున్నా నెగిటివే ఎనర్జీ ఇంటి లోపలి వస్తుంది. 
13.బయట నుంచి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవాలి.  లేదా స్నానం చేయాలి. 
14. తడి కాళ్ళతోనే భోజనం చేయాలికానీ , తడికాళ్ళతో  నిద్రించాకూడదు.